వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా చేపడుతున్న బస్సు యాత్రను విజయవంతం చేద్దామని పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్, శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు వైయస్ జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలనే అంశంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు జిల్లాల రీజనల్ కో -ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ , రాజ్యసభ సభ్యులు, ఎన్టీఆర్ - కృష్ణ - గుంటూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి జరగనున్న తొలిదశ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బస్సు యాత్రలో ఎక్కువ మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa