మణిపూర్‌లో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. తూర్పు ఇంఫాల్, బిష్ణుపుర్, చురాచాంద్‌పుర్ జిల్లాల్లో సోదాలు జరిపి 8 తుపాకులు, 62 తూటాలు, 18 యూనిట్ల పేలుడు పదార్థాలు, స్థానికంగా తయారైన బాంబు లాంఛర్, గ్రనేడ్, వైర్‌లెస్ సెట్లను స్వాధీనం చేసుకున్నామని మణిపూర్ పోలీసులు తెలిపారు. కాగా సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఒక బాధితుడిని భద్రతా బలగాలు మంగళవారం రక్షించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa