ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకురావడాన్ని భారత ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' అనే కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే 4 విమానాల్లో వెయ్యి మందికిపైగా భారత్ కు చేరుకున్నారు. తాజాగా 286 మంది ప్రయాణికులతో ఐదో విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలియన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో వారికి కేంద్ర సహాయ మంత్రి మురుగన్ స్వాగతం పలికారు.