రెండేళ్ల చిన్నారిపై పిన్ని కర్కశత్వం చూపించింది. చిన్నారి ఏడుస్తోందని హత్య చేసిన ఘోర సంఘ్తన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. షకీల్, అతడి సోదరుడు ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. షకీల్ రెండేళ్ల కుమార్తె పిన్ని వద్దకు వెళ్లింది. తరచూ తన వద్దకు వస్తోందని చిన్నారిని చెంపదెబ్బ కొట్టి తల్లి దగ్గరికి వెళ్లమని చెప్పింది. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని ఆగ్రహించిన ఆమె గొంతు నులిమి బాలికను చంపేసింది. ఆపై మృతదేహాన్ని సోఫా కింద దాచిపెట్టింది.