కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్టోబర్ 23వ తేదీన 5 గంటల పాటు విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని శ్రీపద్మనాభస్వామి ఆలయ సంప్రదాయం ఆరట్టు ఊరేగింపు రన్‌వే గుండా వెళ్లేందుకు వీలుగా ఆ రోజు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. దీంతో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విమాన సేవలను నిలిపివేయనున్నారు.