త్వరలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కంటే ఎక్కువగా, ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి 60 శాతం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు. మన దేశం పట్ల ఇండియా కూటమి ఆలోచనలు బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయని తెలిపారు.