మడకశిర నియోజకవర్గం అగలి మండలంలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ లావణ్య బుధవారం తెలిపారు. మధుడి గ్రామానికి చెందిన నరసింహమూర్తి, ఇరిగేపల్లికి చెందిన నింగప్ప, ముత్తెపల్లికి చెందిన లోకేష్ ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 183 మద్యం పాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.