ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'గతంలో చంద్రన్న హయాంలో దసరా, దీపావళి, రంజాన్ వంటి ప్రముఖ పండుగలకు వారం ముందే జీతాలందుకున్న రోజుల నుంచి...జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా...మమ్మల్ని కరుణించన్న అనే రోజులు వచ్చాయి. జగన్ సీఎం అయ్యాక ఉద్యోగులు 1వ తేదీనే మర్చిపోయారు. నెలనెలా ఈఎంఐలు ఎలా చెల్లించాలో తెలియక లబోదిబోమంటున్నా పట్టించుకునే వారే లేరు. ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మింగలేక. కక్కలేక. అన్నట్టు తయారైందని వారికి అర్థమైంది. అంతా అయోమయం జగన్మయంగా మారింది' అని గంటా సెటైర్లు వేశారు.