ప్రపంచంలోనే అత్యంత కారం కలిగిన మిరపకాయ పెప్పర్ ఎక్స్ పేరుతో వచ్చింది. ఈ మిరపను ‘వరల్డ్ హాటెస్ట్ పెప్పర్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న కరోలినా రీపర్ (1.64 మిలియన్ స్కోవిల్లూ హీట్ యూనిట్లు) రకాన్ని వెనక్కి నెట్టి, పెప్పర్ ఎక్స్ (2.69 మిలియన్ స్కోవిల్లే హీట్ యూనిట్లు)రికార్డ్ నమోదు చేసింది. ఈ మిరప రకాన్ని ఎడ్ కర్రీ అనే వ్యక్తి పదేళ్లకు పైగా కష్టపడి ఆవిష్కరించారు.