బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులపై వేటు వేసింది. 11 మంది ఏజీఎంలు, 60 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. డిజిటల్ యాప్ 'BOB వరల్డ్'లోని కొత్త కస్టమర్ల నమోదులో అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ గుర్తించగా బ్యాంక్ యాజమాన్యం ఉద్యోగులపై వేటువేసింది. కాగా గుజరాత్ వడోదర ప్రాంతం నుంచే ఎక్కువ మంది సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది. రాజస్థాన్, యూపీ, ఎంపీలోని పలు ప్రాంతాల ఉద్యోగులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం.