తెలుగు రాష్ట్రాల్లో నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఇద్దరు ఏపీ, మరో ఇద్దరు తెలంగాణ వారిని బదిలీ చేశారు. తెలంగాణకు చెందిన జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ అనుపమ.. ఏపీకి చెందిన జస్టిస్ మానవేంద్రనాథ్, జస్టిస్ వెంకటరమణ బదిలీ అయ్యారు. కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ ఏపీకి రానున్నారు.