గాజాలోని అల్ అహ్లి ఆసుపత్రిలో భారీ పేలుడు ఘటనపై తాను జోర్డాన్ రాజు అబ్దుల్లా 2, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ దాడి నేపథ్యంలో బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దయ్యింది. జోర్డాన్‌లో ఆయన అబ్దుల్లాతో పాటు ఈజిప్టు ప్రధాని ఎల్-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ తదితరులతో భేటీ కావాల్సి ఉంది. ఈ సమావేశం రద్దయినట్లు జోర్డాన్ విదేశాంగ మంత్రి తెలిపారు.