స్కిల్ కేసులో నిధుల మళ్లింపుపై పక్కా ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ, చంద్రబాబు అరెస్టు విషయంలో టీడీపీ వింతగా ప్రవర్తిస్తోందన్నారు. అవినీతి జరిగిందని జీఎస్టీ అధికారులే తేల్చారని అయినా డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని అధికారులు కూడా చెప్పారని గుర్తు చేశారు.