తిరువనంతపురానికి చెందిన శాస్త్రవేత్తలు 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కృత్రిమ చేప తయారీకి కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. వీగన్ ఫిష్ లో అదే రుచి, పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కాగా దీని తయారీకి ఎడిబుల్ ఇంక్ వాడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే గంజి, ఎగ్ ప్రోటీన్స్, చాక్లెట్ కు సంబంధించిన ఇంక్స్ తయారు చేశామని చెబుతున్నారు.