షెల్ కంపెనీల ద్వారా దోచుకుంటే స్కాం కాదా? అని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. స్కిల్ స్కాం కేసులో ఆధారాలు పరిశీలించిన తర్వాతే చంద్రబాబును కోర్టు రిమాండ్ కు పంపిందని అన్నారు. రూ.370 కోట్లను ఫేక్ అగ్రిమెంట్లతో నేరుగా బయటకు పంపారు. రూ.240 కోట్లను షెల్ కంపెనీకి పంపి డ్రా చేస్తే స్కాం కాదా అని ప్రశ్నించారు. ఈ కేసులో టీడీపీ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తోందన్నారు.