పంజాబ్ యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ బుధవారం లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ముఠాకు చెందిన ఒక సభ్యుడిని అరెస్టు చేసినట్లు తెలిపింది. రెండు ముఠా సభ్యులకు ప్రయాణ సదుపాయాలు, నివాసానికి రహస్య స్థలాలను సమకూరుస్తున్నాడని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. దేశంలో అనేక హత్యలతో ఈ ముఠాలకు సంబంధం ఉందని తెలిపారు. కాగా నిందితుడి వద్ద నుంచి 4 పిస్టల్స్, 12 లైవ్ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.