బాపట్ల జిల్లా చుండూరు మండలం తొట్టెంపూడి గ్రామంలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాషా పరిశీలించారు. కార్యక్రమంలో రోగులతో మాట్లాడి సురక్ష కార్యక్రమం పై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.