దళితులకు సామాజిక న్యాయం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకి సంబందించిన సన్నాహాక సమావేశం బుధవారం నెల్లూరు కస్తూరిభా పాఠశాల ఆవరణంలోని రవీంద్రనాధ్ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు.