ఆరోగ్యం అందరి హక్కు అని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.సీఎం వైయస్ జగన్ పేదల ఆరోగ్యానికి రక్షగా నిలిచారన్నారు. ప్రజలకు ఇంటివద్దకే వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. వైద్య-ఆరోగ్య రంగంలో సీఎం వైయస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బుధవారం వడ్లపూడి - I సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ క్యాంపులో 270 మందికి స్పెషలిస్ట్ డాక్టర్స్ పర్యవేక్షణలో వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్బంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ..జగనన్న ఆరోగ్య సురక్ష తో పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రతి గడపకు ఉచితంగా వైద్య సేవలు అందజేయడం ద్వారా, ఆరోగ్యాన్ని ప్రజలందరీ హక్కుగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని అన్నారు.