టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు పలువురు బీజేపీ నేతలు స్పందించడం జరిగిందని ఏపీ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎయిమ్స్ వైద్యులతో ఆరోగ్యం చెక్ చేయించాలన్నారు. రాష్ట్రంలో దిష్టిబొమ్మలు కాల్చినా కూడా కేసులు పెడుతున్నారన్నారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఏపీలో ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు పెట్టి ఆయనను నిబంధనలకు వ్యతిరేకంగా అరెస్ట్ చేశారు అని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.