టీడీపీ అధినేత చంద్రబాబును సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.... ఆరోగ్య రీత్యా చంద్రబాబుని ఆసుపత్రిలో చేర్చి మెరుగైన చికిత్స అందించాలన్నారు. చంద్రబాబుని జైలులో పెట్టిన తర్వాత ప్రజా సమస్యలపై ఎవరూ మాట్లాడటం లేదని, రాష్ట్ర సంపదను జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్, సజ్జలకు చెందిన సూట్ కేసు కంపెనీకు భూములు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని, అన్ని సొసైటీలు కూడా భూములు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాయన్నారు. రెండు ఎకరాల విస్తర్ణంలో ఉన్న బోరు బావుల కోసం ఆరు వేల ఎకరాలు భూములు బలవంతంగా లాక్కోవటం దుర్మార్గమని హర్షకుమార్ అన్నారు.