టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో నిబంధనలు పాటించట్లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హెల్త్ బులిటెన్ కోసం కూడా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబుకు న్యాయ సహాయం అందకుండా మరో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబు లీగల్ ములాఖత్ల్లో కోత విధించారని ప్రశ్నించారు. భువనేశ్వరికి సంఘీభావం తెలపడానికి వెళ్లే వారిపై కేసులు దుర్మార్గమన్నారు.