ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉమ్మడి ప్రణాళికతో ప్రజల్లోకి వెళతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 04:57 PM

టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవం, జనసేన అధ్యక్షుడు పనన్ కళ్యాణ్ ఆలోచన రాష్ట్రానికి ఎంతో అవసరమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.....  రెండు నాయకత్వాలు కలసి రాష్ట్ర భవిష్యత్ కోసం ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళబోతున్నామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని, రెండు పార్టీల కలయిక ద్వారా ఏపీలో ఇంకా మెరుగైన అభివృద్ధి తీసుకొచ్చే విధంగా కృషిచేస్తామని స్పష్టం చేశారు. త్వరలో ఉమ్మడి ప్రణాళికతో టీడీపీ, జనసేన ఇంటింటికీ వెళ్ళే కార్యక్రమం చేపడతామన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com