మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పోలీసులు కొన్ని గంటల పాటు అక్రమంగా నిర్బంధించారని పిటిషనర్ తరపున వాదించారు. కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసినట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. 151 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తే రవీంద్ర నిరాకరించారని కోర్టుకు పోలీసులు చెప్పారు. 151 నోటీసు పెద్ద నేరానికి పాల్పడితేనే ఇస్తారు కదా అని న్యాయస్థానం ప్రశ్నించారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను దసరా సెలవల తర్వాతకు హైకోర్టు వాయిదా వేసింది.