జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును గురువారం తెనాలి పట్టణం సాలిపేట రోడ్డులోని డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. జశ్వంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. 20వ వార్డు సచివాలయం పరిధిలోని ప్రజలకు ఇక్కడ వైద్య సేవలు అందించటం జరుగుతుందన్నారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడికల్ క్యాంప్ కొనసాగుతుందని చెప్పారు.