బొర్రా కరకవలస గ్రామానికి చెందిన కిల్లో మహేష్ కుమారుడు కిల్లో.బాలు(9) బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేసింది. అరగంట సమయం తర్వాత 108 వాహనంలో అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఆరోగ్యం విషావించడంతో విశాఖ కేజీహెచ్ కు తరలిస్తుండగా బలుగూడ మార్గం మధ్యలో బాలుడు మృతి చెందాడు. అరకు పోలీసులు కేసును విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నారు.