ఆత్మకూరు మండలంలో కన్నయ్య కట్ట వీధిలో కరెంట్ స్తంభం కూలడానికి సిద్ధంగా ఉన్నా ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోలేదు అని గురువారం ప్రజలు అన్నారు. విద్యుత్ శాఖ వారికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకునే నాధుడే లేదన్నారు. దసరా సెలవులు కాబట్టి పిల్లలు వీధుల్లో ఆడుకోవడానికి వస్తారు. అక్కడక్కడ తిరుగుతూనే ఉంటారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.