ప్రకాశం జిల్లా కంభం మండలం సూరేపల్లి గ్రామ సమీపంలోని రైలు పట్టాల సమీపంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు మృతి చెంది రెండు రోజులకు పైగా అయి ఉండొచ్చని మృతుడు రైలు నుంచి జారిపడ్డాడా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.