ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం శివాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఖండిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.