ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మహారాష్ట్రలో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ కౌశల్య వికాస్ కేంద్రాలను ప్రారంభించారు. దివంగత బిజెపి నాయకుడు ప్రమోద్ మహాజన్ పేరు మీద ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు మహారాష్ట్రలోని 34 గ్రామీణ జిల్లాల్లో స్థాపించబడ్డాయి. ప్రధానమంత్రి కార్యాలయం నుండి విడుదలైన ఒక ప్రకటన ప్రకారం, ఈ కేంద్రాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రంగాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాయి.ప్రతి కేంద్రం కనీసం రెండు వృత్తి విద్యా కోర్సుల్లో సుమారు 100 మంది యువకులకు శిక్షణ ఇస్తుంది. ఉపాధి కోసం యువత గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్లకుండా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు దోహదపడతాయని, భవిష్యత్తులో ఇలాంటి కేంద్రాల సంఖ్యను పెంచుతామని మంత్రి లోధా తెలిపారు.