AP: సినిమా టికెట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన కమిటీ సమావేశం అనంతరం మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నారని, ఇకపై ఆ పద్ధతిని మార్చి, ఒక కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. అన్ని సినిమాలకు కేటగిరీ ప్రకారం సమానంగా టికెట్ రేట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa