చిలకలూరిపేట పట్టణంలోని ఓల్డ్ బ్యార్ని నగర్ లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వైయస్ ఆర్ సీపీ యువ నాయకులు విడదల గోపీ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంత్రి విడదల రజిని కి సమాచారం అందజేశారు. వెంటనే స్పందించి మంత్రి రజిని ఆదేశాలతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్స్, వాటర్ ట్యాంక్ లు రాగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.