అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి కలిశారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19 వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి, తాము సాధించిన పతకాలను సీఎం వైయస్ జగన్‌కు క్రీడాకారులు చూపించారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.