విద్య వ్యవస్థలో సీఎం, ప్రభుత్వం తన తెలివితో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇంగ్లీష్ మీడియం అందరూ చదువుకోవాలని జగన్ అంటున్నారని, ఇంగ్లీష్ మీడియం మొదటి నుంచి ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. 43 వేల స్కూల్స్‌లో సీబీఎస్ సిలబస్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని, అసలు వెయ్యి స్కూల్స్‌కే దిక్కులేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం తీసుకొచ్చిందని, అది కాకుండా వేరేది తీసుకొస్తున్నారని, మన దగ్గర దాదాపు 2 లక్షలకుపైగా టీచర్లు ఉన్నారని.. వారికి ఎప్పుడు కోచింగ్ ఇవ్వాలి?అని ప్రశ్నించారు. జగన్ నిర్ణయాలతో విద్యార్ధుల జీవితాలు నాశనమవుతున్నాయని అన్నారు. డబ్బులు తినేయడానికి ఇవ్వన్నీ చేస్తున్నారని విమర్శించారు.