కృష్ణా జిల్లా, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌పై మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ఎమ్మెల్యే.. వీధి రౌడీలా ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే వారిని నిర్బంధించిన పోలీసులు.. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రమేష్‌ను మాత్రం వదిలేశారన్నారు. ఎమ్మెల్యేపై కేసు పెట్టకుంటే ప్రైవేటు కేసులు వేస్తామని బుద్ధప్రసాద్ హెచ్చరించారు.