వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రైవేట్ స్కూళ్లల్లో అందించే ఖరీదైన విద్యను పేదలకు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందిస్తుంటే కొందరు బురద జల్లుతున్నారన్నారు. సెలిబ్రిటీ పార్టీ మళ్లీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఐబీ ఒప్పందంపై మళ్లీ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఐబీ ఒప్పందంలో ఏదో స్కాం జరిగిందనే ఆరోపణలు చేశారన్నారు. ఫైనాన్స్, న్యాయ విభాగాలు అభ్యంతరం తెలిపినా ఒప్పందం చేసుకున్నారని ఆరోపిస్తున్నారని అన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందకూడదనా..? ఆ సెలిబ్రిటీ పార్టీ ఉద్దేశ్యం అని ప్రశ్నించారు. ఐబీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు.