పెళ్లి మర్రి మండలం గంగన పల్లి గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వైద్య సిబ్బందితో మాట్లాడి అక్కడ అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం పౌష్టికాహార స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.