జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సదుం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు.