ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రూనోతో పదేళ్ల బంధానికి స్వస్తి పలికారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించారు. ఈ జంటకు ఏడేళ్ల కుమార్తె ఉంది. ‘ఆండ్రియా జియాంబ్రూనోతో దాదాపు 10 ఏళ్ల పాటు కొనసాగిన మా బంధం ఇవాల్టితో ముగిసింది.. మా దారులు కొంతకాలంగా మారాయి.. దానిని గుర్తించే సమయం ఆసన్నమైంది.. మేము కలిసి గడిపిన అద్భుతమైన ఏళ్లలో ఇబ్బందులనూ ఎదుర్కొన్నాం.. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం కుమార్తె గినేవ్రా ఇచ్చినందుకు నేను ఆండ్రియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.’ అని మెలోని ట్వీట్ చేశారు. ఇటలీకి చెందిన ప్రముఖ టీవీ ఛానెల్ రెటా 4aలో ఆండ్రియా గియాంబ్రూనో వ్యాఖ్యాతగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టులో టెలీకాస్ట్ అయిన ‘డయారియో డెల్ గియోర్నో’ అనే ప్రోగ్రామ్‌లో ఆండ్రియా గియాంబ్రూనో అభ్యంతకరమైన భాషను వాడటం.. సహోద్యోగిపై సెక్సీయస్ట్ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. మహిళలు మద్యం ఎక్కువగా తాగకుండా ఉంటే అత్యాచారాలు నివారించవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ఎపిసోడ్ తర్వాత ఆండ్రియా చేసిన వ్యాఖ్యలకు తనను విమర్శించవద్దని.. అలాగే, అతని ప్రవర్తన గురించిన అడిగే ప్రశ్నలకు తాను జవాబు చెప్పబోనని అన్నారు.
తాజాగా, భాగస్వామి నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన ఇటలీ ప్రధాని. ‘మనం ఉన్నదానిని నేను కాపాడుకుంటాను.. మా స్నేహాన్ని కాపాడుకుంటాను.. నేను నా ప్రేమను తల్లిని, తండ్రినే ప్రేమించే ఏడేళ్ల బాలికను నేను ఎలాగైనా రక్షిస్తాను.. దీని గురించి నేను వేరే చెప్పడానికి ఏమీ లేదు.’ అని కుమార్తె రక్షణ గురించి మెలోని భావోద్వేగంతో ట్వీట్ చేశారు. ఇక, తనకంటే వయసులో నాలుగేళ్ల చిన్నవాడైన ఆండ్రియాను మెలోనీ మొదటిసారిగా టీవీ షోలోనే కలిశారు. ఆ పరిచయం స్నేహంగా మారి.. ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం సాగిస్తున్నారు. ఇక, రోమ్‌కు చెందిన ఓ కార్మిక కుటుంబంలో జన్మించిన మెలోనీ.. కేవలం 15 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చారు. ఇటాలియన్ సోషల్ మూవ్‌మెంట్ (ఎంఎస్ఐ) యూత్ వింగ్‌లో చేరారు. క్రమంగా పార్టీలో ఎదుగుతూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది సెప్టెంబరు చివరిలో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఏర్పడిన పూర్తి అతివాద ప్రభుత్వం ఇదే ‘గాడ్ ఫాదర్‌ల్యాండ్ ఆఫ్ ఫ్యామిలీ’ అనే వివాదాస్పద నినాదంతో ప్రజలను ఆకర్షించారు. గత ఎన్నికల్లో మెలోని పార్టీ కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa