అనంతపురం జిల్లా, పుట్లూరు మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులకు హెచ్చెల్సీ ద్వారా నీటిని వదలాలని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. చెరువుల్లో నీరు లేకపోతే బోర్లు రీచార్జ్ కావన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు పడతారని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.