టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకి నిరసనగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై పుంగనూరులో పెద్దిరెడ్డి అనుచరులపై దాడి చేసారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే!. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడు. టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డు పై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ లోకేష్ తెలియజేసారు.