పీలేరు ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఓ మెకానిక్ అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక ఆర్టీసీ గ్యారేజీలో మెకానిక్ గా పనిచేస్తున్న బి. వెంకట్రమణ శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో హుటా హుటిన అతన్ని పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. రక్త పోటు అధికం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.