ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. కనేకల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం కనేకల్ మండల కో ఆప్షన్ సభ్యులు చిన్న శర్మాస్ స్వంత నిధులతో శనివారం త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న శర్మాస్ ను ఆయన అభినందించారు.