ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వెలుపల మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహ ఏర్పాటు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను శనివారం ఆదేశించారు. కలెక్టరేట్ లో విగ్రహ కమిటీ సమావేశం జరిగింది. గతంలో కొన్ని ప్రభుత్వ శాఖలు అభ్యంతరం తెలిపాయి. దీనిపై సమీక్ష చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.