విశాఖలోని కేజీహెచ్, విమ్స్ ఆసుపత్రిలకు మహర్దశ పట్టనుంది. రూ. 21. 92 కోట్లతో కింగ్ జార్జ్ హాస్పిటల్ అభివృద్ధి చేస్తామని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. అలాగే రూ. 250 కోట్లు విమ్స్ లో అత్యాధునిక వైద్య సేవలకు కేటాయించామని ఆమె తెలిపారు. ఆదివారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.