టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కేవలం ఏడవటానికే మాత్రమే పనికొస్తాడని.. పార్టీని నడిపేందుకు పనికిడని విమర్శించారు. లోకేశ్‌కు పార్టీని నడిపే సత్తా, సామర్థ్యం లేవన్నారు. లోకేశ్ టీడీపీకి పట్టిన శని అని తీవ్రస్థాయిలో విమర్శించారు. లోకేశ్ రాకతోనే టీడీపీ పతనం ప్రారంభమైందని, రాజకీయాలకు పనికిరాడని.. టీడీపీకి నాయకత్వం వహించే లక్షణాలు కూడా లేవని ఎద్దేవా చేశారు.