ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ అర్హతతో మీరు ఇక్కడ ఓటు అడుగుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 12:49 PM

చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌ ఉండేదేమో హైదరాబాద్‌లో .. వారు రాజకీయాలు చేయడానికి, అధికారం కోసం ఆంధ్రరాష్ట్రం కావాలంట. అసలు, ఏ అర్హతతో మీరు ఇక్కడ ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారో సమాధానం చెప్పండి..?అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ...  2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీచేసి పొత్తుతో అధికారంలోకొచ్చి ఏం వెలగబెట్టారు.?. మీరంతా కలిసి ప్రజాధనం దోచుకుని, ఇప్పుడు సాక్ష్యాధారాలతో దొరికి దొంగలా జైలుపాలయిందేగాక.. మళ్లీ మేము కలిసివస్తాం.. దీవించండి.. ఆశీర్వదించండి అంటారా.. ఈసారి మీరిద్దరూ ప్రజల ముందుకెళ్తే వాళ్లు మీ ముఖాలపై ఉమ్మేయడమే తరువాయిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఇద్దరుగా గాకుండా ముగ్గురు, నలుగురుగా వచ్చి ఎన్నికల్లో నిలబడి ప్రజల ముందు పొర్లుదండాలు బెట్టినా మీకు ఓటమే తప్ప గెలుపు రాతలేదని హెచ్చరిస్తున్నాను అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com