రాష్ట్ర విద్యావ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ..... పవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని, తెలియక పోతే ట్యూషన్ చెప్పించుకోవాలని విమర్శించారు. కావాలంటే తానే ట్యూషన్ చెబుతానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ హయాంలో విద్యా మంత్రిగా ఉన్నానని, అప్పుడు తమమీద ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించుకున్నామని అన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ని వారి పార్టనర్ మీద సీబీఐ విచారణ జరిపించమని అడగాలన్నారు.