విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆదివారం నాటికి 8 వరోజుకు చేరాయి. ఇవాళ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు అమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాడ విశ్వాసం. లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందుతూ ఇంద్రకీలాద్రిపై స్వయంగా అష్టమి తిధినాడు ఆవిర్బవించింది. అందుకే దుర్గాష్టమిగా పిలువబడుతుంది. ఈరోజు దుర్గాదేవి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.