స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో నింద ఆరోపించబడ్డ నిందితులందరికీ 30-32 రోజుల్లోనే బెయిల్ వచ్చిందని.. కానీ చంద్రబాబుకి మాత్రం రాలేదని టీడీపీ యువనాయకులు లోకేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అయన మాట్లాడుతూ.. తన తండ్రి అరెస్టు గురించి తలచుకుంటే బాధేస్తోందని.. 45 ఏళ్లు క్రమశిక్షణ, పట్టుదలతో మన కోసం పనిచేశారని అన్నారు. చంద్రబాబుకు డబ్బులే కావాలనుకుంటే రాజకీయం కావాలా? పారిశ్రామికవేత్తగా మారితే ఆయన పట్టుదల, శ్రమ ముందు దేశంలో ఏ పారిశ్రామికవేత్తా నిలబడేవారు కాదు. చంద్రబాబును నిజాయతి మనిషి కాబట్టే అరెస్టు చేస్తే దేశమంతా కదిలి, నిరసన తెలిపింది. జగన్‌ను అరెస్టు చేస్తే ఒక్కళ్లు కూడా బయటకు రాలేదు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa